Monday, December 13, 2021

short movie script

 సీన్ - 1
********
లొకేషన్: మలబార్ గోల్డ్ షాప్
భర్త: (ఒక నెక్లెస్ చూపించి)ఇదెలాగుంది? 
బార్య: (నెక్లెస్ ట్రై చేసి), అబ్బ ఎంత బాగుంది! ధర ఎంతుంటుందో?
సేల్స్మన్: (నెక్లస్ తూకం వేసి) 2.2 లాఖ్స్. మీకు నచ్చితేమా మేనేజర్తో డిస్కౌంట్ ఎంతో అడుగుతాను.
భార్య: అంత ధరా? వద్దు లెండి.
భర్త: నీ బర్త్డేకి ఆమాత్రం ఖర్చుపెట్టలేనా? ఉండనీయ్. నెక్లెస్ నీకోసమే చేసినట్టుంది.
సీన్ - 2
******
లొకేషన్: ప్యారడైజ్ రెస్టారంట్ -బైక్ పార్కింగ్
ఇద్దరు బాయ్స్ స్విగ్గీ డ్రెస్లో బైక్ల దగ్గర న్లించుంటారు
బాయ్ 1: ఇవ్వాల నాది రికార్డు. ఇప్పటికి 26 ఆర్డర్లు డెలివరీ చేసా.
బాయ్ 2: హు.నాది ఇంకా పెన్నెండే. ఇంటికి పొయ్యే లోపల ఇంకో 8 ఆర్డర్లన్నా దొరకాలి. 
బాయ్ 2 (మల్లీ): ఎట్ల కొడ్తవు అన్ని డేలివరీలు ఇంత ట్రాఫిక్లో?
బాయ్ 1: సింపుల్ మామా! ట్రాఫిక్ ఆగినప్పుడు సందుల్లోంచి పొయ్యి బండి ముందర పెట్టాలి. గ్రీన్ పడంగనే మనమే ఫస్ట్ బండి స్టార్ట్ చెయ్యాలె.
బాయ్ 2: నీది సూపర్ డ్రైవింగ్ మామా! ఈసారి ట్రై చేస్తా.
ఇప్పటికి రెండు లేట్ డేలివరీలయినయ్ ఈవారంల. మల్లీ అయితె నాకు 20 పెర్సంట్ కట్ అయితది.
సీన్ 3:
*******
లొకేషన్: హ్యుండై క్రేతా..భర్త కారు డ్రైవ్ చేస్తూంటడు.
భార్య: ఎందుకంత ఖర్చు చేసినవ్? వద్దన్న కద?
భర్త: డార్లింగ్..నీకోసం ఆమాత్రం చెయ్యనా?
కారు ఒక సైడ్ ఆపుతాడూ. కొంచెం చీకటిగా ఉంటుంది.
భార్య: ఎందుకు కారాపావ్?
భర్త: చిన్న పని ఉంది.
భర్త ఒక్కసారి పక్కకు జరిగి భార్యకు లాగి గట్టిగా ముద్దిస్తాడు.


భార్య: (సహకరిస్తూనే సిగ్గుపడి) ఇదేనా చిన్న పని?
భర్త: "కాదు. ఇంకో ముఖ్యమయిన పని ఉంది".అని కారు దిగుతాడు. ఎదురుగా (కొంచెం దూరంలో)"మార్వల్ వైన్స్" బోర్డు కనిపిస్తుంది. జనం మందు బాటిల్లకోసం గుమి గూడి ఉంటారు. 
భర్త కారు ఎడం పక్కకు వచ్చి డోరు తీసి భార్యకు "నువ్వెల్లి డ్రైవింగ్ సీటులో కూర్చో" అని చెప్పి షాపుకెల్లి ఒక బ్లాక్ డాగ్ హాఫ్ బాటిల్ తీసుకొస్తాడు.
ఠక్కున ప్యాసెంజర్ సీటులో కూర్చుని టక టకా రెండు పెగ్గులేస్తడు.
భార్య: ఇదేంటండి, ఇక్కడ తాగుతున్నరు? 
భర్త: ఇదే మంచి స్పాట్. బార్ కెలితే రెండు పెగ్గులకు వెయ్యి రూపాయలైతయ్.
భార్య: తొందరగా తాగండి, ఆకలేస్తుంది, ఏదన్న రెస్టారంటుకెల్దాం.
భర్త: లేటవుతుంది. స్విగ్గీలో ఆర్డర్ చెయ్యి, మనం ఇంటికెల్లేలోగా వస్తుంది.
భార్య: స్విగ్గీ ఆప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తుంది.
సీన్ 4:
*******
బాయ్ 2: పదమూడో ఆర్డరు దొరికింది.
బాయ్ 1: గుడ్ లక్ మామా!
బాయ్ 2 రెస్టారెంటు వైపు నడిచి, కౌంటర్లో భాయ్ తొందరగా సప్లై చెయ్యి, ఇవ్వాల ఇంటికి పొయ్యేటరకు ఇంకో ఏడు ఆర్డర్లు డెలివరీ చెయ్యాలె.
సీన్ 5: భార్య డ్రైవ్ చేస్తూ.. 


నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్ కాదని తెలిసి కూడా ఎందుకు తాగినవు? 
భర్త: నాకు నీమీద కాంఫిడెన్స్ ఉంది డార్లింగ్!
కొంచెము ముందుకు వెల్లిన తరువాత సడంగా గ్ర్రెన్ రెడ్ అవుతుంది. వెనుకాలనుంచి కొందరు కారువాల్లు హార్న్ కొడుతుంటరు. కంఫ్యూషన్లో భార్య స్పీడ్ పెంచుతుంది.
అవతలి పక్కన ఎప్పుడు గ్రీన్ పడుతుందా అని ఇంజెన్ రైజ్లో పెట్టిన బాయ్ 1 ఒక్కసారి ముందుకు వస్తడు.
ఆక్సిడెంట్.
బైక్ కింద పడుతుంది.
భర్త పక్క నుంచి, ఆపకు పోనీయ్, ఏంకాదు.. నేను చూసుకుంట.
బార్య: అయ్యో పాపం, ఆపుదాం. ఏమయిందో. 
భర్త: ఆపిటే కనీసం పదివేలు అడుగుతరు, పద పద.. 
సీన్ 5:
**
ఆక్సిడెంటు అయిన కుర్రాడు కల్లు తిరిగి పడిపోతడు. చేతికి కొంచెం దెబ్బ తగిలి రక్తం వస్తుంటుంది. జనంలో కొందరు పక్కకు తీసుకెల్లి కూర్చోబెడుతరు.
ఒక వ్యక్తి బండిని పక్కకు తీసుకొచ్చి స్టాండ్ వేస్తడు.
ఎవరో కూల్డ్రింక్ తెచ్చి కొంచెం మొహం మీద కొడితే కుర్రాడు లేస్తడు.
జనం: 
1. కూల్డ్రింక్ తాగు.
2. కాస్సేపు రెస్ట్ తీసుకో
3. హాస్పిటల్ వెల్దాం పద.
4. ఎవతో..పనికి మాలింది. గుద్దినంక ఆపకుండ వెల్లిపొయ్యింది.

కుర్రాడు: అయ్యో.. అప్పుడే 20 మినట్స్ అయ్యింది.
జనం: దేనికి?
కుర్రాడు: 20 మినట్స్ లో నేణు ఆర్డర్ డెలివరీ చెయ్యకపోతే లేట్ డెలివరీ పడుతది.
జనం 1: పడితే పడ్డదిలే. రెస్టు తీసుకో.
కుర్రాడు: లేదు, నేను వెల్లాలి..
అనుకుంటూ చాత కాకపోయినా బండి తీస్తుంటడు.
అంతలో ఫోన్ రింగవుతది. 
కుర్రాడు: హలో
స్విగ్గీ ఆపరేటర్: ఇంతసేపు ఏం చేస్తున్నవ్? నీమీద లేట్ రిమార్క్ వచ్చింది.
కుర్రాడు: రెండు నిముషాల్లో డెలివరీ చేస్త.
సీన్ 6
**
ఇంటిదగ్గర భార్యా భర్తలు.
భార్య: అబా, వదలండి.
భర్త: పుట్టిన రోజు డార్లింగ్, అడిగింది లేదనొద్దు.
భార్య: ఇప్పుడు స్విగ్గీ వాడు వస్తడు.
భర్త: రానియ్ వెధవని, లేటుగా వచ్చినందుకు రెండు దొబ్బుతా.
ట్రింగ్ ...ట్రింగ్... (కాలింగ్ బెల్)
భార్య వెల్లి డోర్ ఓపెన్ చేస్తుంది.
ఎదురుగా కుర్రాడు. చేతికి దెబ్బతో. భార్య గుర్తు పడుతుంది, అదే మొహం, అదే స్విగ్గీ చొక్కా.
భార్య మెల్లిగా లోపలికి వచ్చి భర్తతో మెల్లిగా..అదే ఆక్సిడెంట్ కుర్రాడు. చేతికి దెబ్బకూడా ఉంది. ఏం చేద్దాం?
భర్త: సరే..నేణు చూస్తాను, నువ్వు లోపలకు వెల్లు.
భర్త, కుర్రడితో; ఇదిగో ఈ వంద ఉంచు.
కుర్రడు. ఠాంక్స్ సర్.
కుర్రాడు (బైక్ తీస్తూ),  వంద రూపాయల నోటును ప్రేమగా చూసుకుంటాడు.


Thursday, December 2, 2021

ఓ ఆదివారం

  ఆదివారం


ఆదివారం, పన్నెండయ్యింది. ఎక్కడికైనా వెల్దాం అని మావాడిగోల. నాకేమో మాల్స్, షాపింగ్ ఇష్టం ఉండవు. దగ్గరలో ఉన్న ఒక్క అనంతగిరి చాలా సార్లు వెల్లాము, మల్లీ వెలితే బోరు కొడుతుంది. 


"సరే, ఇవ్వాల మాస్కూలు చూపిస్తాను వెలదాం పద!" అన్నాను. సర్వేలు చూసి చాన్నాళ్ళయ్యింది కాబట్టి నాక్కూడా ఎప్పటినుంచో ఒకసారి వెళ్ళి రావాలని ఉంది.


"మీది గవర్నమెంటు స్కూలు కద? మీస్కూళ్ళో చూడ్డానికి ఏముంటుంది? అసలు మీస్కూలుకు ప్లేగ్రౌండ్ అయినా ఉందా?" మా ఆరేళ్ళ బాబు ప్రశ్న. మా స్కూళ్ళో ఆకాలంలోనే ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌బాల్ గ్రౌండ్స్, పెద్ద లైబ్రరీ, సైన్సు ల్యాబ్,  సొంత స్కూల్ బ్యాండ్, ఎన్సీసీ, స్కౌటు వగైరాలెన్నో ఉన్నాయని చెప్పి ఊరిస్తే చివరికి ఒప్పుకున్నాడు. ఎలాగైతేనేం, నేనూ, మాఅవిడా, అబ్బాయి కలిసి కార్లో బయలు దేరాం.


చౌటుప్పల్ దాటినంక కొత్తగా వచ్చిన తార్ రోడ్డును చూసి ముచ్చటేసింది. నేను మొదటిసారి వచ్చినప్పుడు బస్సూ, టెంపో కూడా ఎంతకసేపటికీ దొరక్కపోతే టాంగాలో వెల్లిన సంగతి గుర్తొచ్చింది. గతుకుల కంకరరోడ్డు మీద టాంగాలో చౌటుప్పల్ నుంచి సర్వేలు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది.


సర్వేలు చేరుకున్నాం. ముందుగా ప్రజాహోటల్ వెల్లి ఒకటీ తాగాము. అప్పట్లో శనివారం వచ్చిందంటే ప్రజాహోటల్ పూరీటిఫినే గతి నాకు. 


తరువాత పాత క్యాంపస్ కెల్లి శిధిలావస్తలో ఉన్న ఆర్ట్ రూం, ఎన్సీసీ రూం, స్కౌట్ రూం, సైన్సు ల్యాబూ చూపించాను. పాత పదోతరగతి క్లాసుల ముందర సిమెంటుతో చేసిన ఇండియా మ్యాపు, అందుకో అందంగా మలిచిన హిమాలయాలు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. కోటయ్య సారు చేసిన సరస్వతి విగ్రహం ముందర నిలబడి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం.


అక్కడినుంచి కొత్త క్యాంపస్ వైపు వెల్తుంటే మూతబడ్డ మదార్ బడ్డీకొట్టు కనిపించింది. నైట్ వాచ్‌మన్ మదార్ గేటుదగ్గర బడ్డీ కొట్టు పెట్టుకుని పొద్దున పాలలోకి తినడానికి పావలాకి రెండు బ్రెడ్డుముక్కలూ, సాయంత్రం డిన్నర్‌లోకి తినడానికి రూపాయికి ఒక ఆమ్లెట్టు అమ్మేవాడు. మదార్ ఇప్పుడు చనిపోయాడట. బడ్డీకొట్టు ఎవరూ నడపడం లేదులాగుంది.


నేను చదివినప్పుడు స్కూళ్ళో మధ్యతరగతి పిల్లలు ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు అస్సలు డబ్బులు లేనివారు తప్ప వేరే ఎవరూ గవర్నమెంటు స్కూల్లకు పిల్లలను పంపడం లేదు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు డబ్బులు లేని నిరుపేదలే వస్తున్నారు, అయినా స్కూలు సక్సెస్ రేటు మాత్రం చెక్కుచెదరలేదు.  ఇప్పటికీ ఇక్కడినుండి బయటికి వెల్లినవారికి భవిష్యత్తు బాగానే ఉంటుంది. 


పరిస్థితులు ఎంత మారినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ఈబడి మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉంది, మౌనంగా. సమాజానికి మెరికల్లాంటి కొత్త రక్తాన్ని సరఫారా చేస్తూనే ఉంది, నిరంతరంగా. ఆశా, ఆవేదనలతో కలగాపులగమయిన ఆలోచనల్లో తిరుగుప్రయాణమయ్యాము.

Monday, November 29, 2021

అభివృద్ధి

 అభివృద్ధి


ఆదివారం, పన్నెండయ్యింది. ఎక్కడికైనా వెల్దాం అని మావాడిగోల. నాకేమో మాల్స్, షాపింగ్ ఇష్టం ఉండవు. దగ్గరలో ఉన్న ఒక్క అనంతగిరి చాలా సార్లు వెల్లాము, మల్లీ వెలితే బోరు కొడుతుంది. 

"సరే, ఇవ్వాల మాస్కూలు చూపిస్తాను వెలదాం పద!" అన్నాను. సర్వేలు చూసి చాన్నాళ్ళయ్యింది కాబట్టి నాక్కూడా ఎప్పటినుంచో ఒకసారి వెళ్ళి రావాలని ఉంది.

"మీది గవర్నమెంటు స్కూలు కద? మీస్కూళ్ళో చూడ్డానికి ఏముంటుంది? అసలు మీస్కూలుకు ప్లేగ్రౌండ్ అయినా ఉందా?" మా ఆరేళ్ళ బాబు ప్రశ్న. మా స్కూళ్ళో ఆకాలంలోనే ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌బాల్ గ్రౌండ్స్, పెద్ద లైబ్రరీ, సైన్సు ల్యాబ్,  సొంత స్కూల్ బ్యాండ్, ఎన్సీసీ, స్కౌటు వగైరాలెన్నో ఉన్నాయని చెప్పి ఊరిస్తే చివరికి ఒప్పుకున్నాడు. ఎలాగైతేనేం, నేనూ, మాఅవిడా, అబ్బాయి కలిసి కార్లో బయలు దేరాం.

ఔటర్ రింగ్ రోడ్డు మీద బయల్దేరి హైవే మీదుగా బయల్దేరాం. చౌటుప్పల్ దాటినంక కొత్తగా వచ్చిన తార్ రోడ్డును చూసి ముచ్చటేసింది. నేను మొదటిసారి వచ్చినప్పుడు బస్సూ, టెంపో కూడా ఎంతకసేపటికీ దొరక్కపోతే టాంగాలో వెల్లిన సంగతి గుర్తొచ్చింది. గతుకుల కంకరరోడ్డు మీద టాంగాలో చౌటుప్పల్ నుంచి సర్వేలు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది. ఎవరన్నది, దేశం అభివృద్ధి చెందట్లేదని? అనిపించింది.

సర్వేలు చేరుకున్నాం. ముందుగా ప్రజాహోటల్ వెల్లి ఒకటీ తాగాము. అప్పట్లో శనివారం వచ్చిందంటే ప్రజాహోటల్ పూరీటిఫినే గతి నాకు. ఇప్పుడు స్కూలు పిల్లలెవరూ రావట్లేదట. అంటే మన స్కూల్లో ఇప్పుడు వంటలు అంతబాగా చేస్తున్నారా? లేకపోతే పిల్లలదగ్గర డబ్బులు లేవా? బహుషా రెండూ అయుండొచ్చు.

తరువాత పాత క్యాంపస్ కెల్లి శిధిలావస్తలో ఉన్న ఆర్ట్ రూం, ఎన్సీసీ రూం, స్కౌట్ రూం, సైన్సు ల్యాబూ చూపించాను. పాత పదోతరగతి క్లాసుల ముందర సిమెంటుతో చేసిన ఇండియా మ్యాపు, అందుకో అందంగా మలిచిన హిమాలయాలు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మేము చదువుతున్నప్పుడు ఆర్టు సారు తయారు చేసిన వినాయకుడి విగ్రహం, సరస్వతి విగ్రహం కూడా అలాగే ఉన్నాయి. సరస్వతి విగ్రహం ముందర నిలబడి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం.

అక్కడినుంచి కొత్త క్యాంపస్ వైపు వెల్తుంటే మూతబడ్డ మదార్ బడ్డీకొట్టు కనిపించింది. నైట్ వాచ్‌మన్ మదార్ గేటుదగ్గర బడ్డీ కొట్టు పెట్టుకుని పొద్దున పాలలోకి తినడానికి పావలాకి రెండు బ్రెడ్డుముక్కలూ, సాయంత్రం డిన్నర్‌లోకి తినడానికి రూపాయికి ఒక ఆమ్లెట్టుఅమ్మేవాడు. మదార్ ఇప్పుడు చనిపోయాడట. బడ్డీకొట్టు ఎవరూ నడపడం లేదులాగుంది. డైనింగ్‌హాల్ దూరంగా ఉండడం వల్లనో పిల్లలదగ్గర డబ్బుల్లేకపోవడం వల్లనో ఇప్పుడెవరూ ఆమ్లెట్లు అమ్మడం లేదు.

కొత్తగా కట్టిన స్టాఫ్‌రూంలూ, డైనింగ్‌హాల్ కనిపించాయి ఫరవాలేదు స్కూలిప్పుడు బాగానే ఉందనుకున్నాను. మావాడికి ఫుట్‌బాల్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్ చూపించాను. అక్కడినుంచి డార్మిటరీలవైపు వెల్లాం. కొన్ని హౌజుల్లో విరిగిపోయిన మంచాలు దర్శనమిస్తే ఇంకొన్నిట్లో కొందరు సొంతగా ఇంటినుంచి తెచ్చుకున్న నవారు మంచాలు వాడుతున్నారు. నేను చదువుకున్న రోజుల్లో ఉన్న టేకు బంకు బెడ్లు ఒక్కసారి గుర్తుకొచ్చాయి. అప్పటికి ఆరేల్లక్రితం పదోతరగతి పిల్లలకి అల్యూమ్నై తరఫున మంచాలిచ్చినట్టు గుర్తు. బహుషా మిగిలిఉన్న కొన్ని మంచాలూ అవే అయుంటాయి. లక్షకోట్ల బడ్జెట్లు సమర్పించే ప్రభుత్వాలదగ్గర పిల్లలకు కావల్సిన మంచాలు చేపించడానికి కావాల్సిన ఫండ్సు ఎందుకు లేవో అర్ధం కాలేదు.

సాయంత్రం నాలుగు అయింది. పిల్లలు స్టడీ పీరియడ్ ముగించుకుని గ్రౌండ్ వైపు వచ్చారు. ఎక్కువమంది ఆటలు ఆడుతున్నట్టు కనపడలేదు. స్పోర్ట్స్ రూం దగ్గర కొద్దిమంది పిల్లలు చెస్‌బోర్డు తీసుకుని ఆడుకుంటున్నారు. ఇంకొంతమంది విరిపోయిన టెన్నికాయిట్ దారంతో కూట్టినట్టున్నారు, టెన్నికాయిట్ ఆడుతున్నారు. కొంతమంది ఒక చెక్క బ్యాటుతో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు ఆడే బాల్ కాస్త విచిత్రంగా అనిపిస్తే అదేం బాలని అడిగాను. సాక్స్ బాల్ అని సమాధానం వచ్చింది.ఒక చిన్న రాయిని చిరిగిపోయిన సాక్సులతో చుట్టి ఉండలాగా చేశారు. అదే సాక్స్ బాల్. బాధేసింది..స్కూలు దగ్గర బాల్ లేకపోతే కనీసం ఇరవై రూపాయలు పెట్టి ఒక రబ్బరు బాలు సొంతంగా కొనలేని స్థితిలో ఉన్నారా ఈవిద్యార్థులు? 

నిజమే. నేను చదివినప్పుడు స్కూళ్ళో మధ్యతరగతి పిల్లలు ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు అస్సలు డబ్బులు లేనివారు తప్ప వేరే ఎవరూ గవర్నమెంటు స్కూల్లకు పిల్లలను పంపడం లేదు. అయితే దేశం అభివృద్ధి చెందుతుంది, రోడ్లు బాగవుతున్నాయి, కొత్త కొత్త కార్లు, ఇఫోన్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ స్కూళ్ళు కనిపిస్తున్నాయి. కానీ అభివృద్ధి ఫలాలు అందరికీ ఎందుకు చేరడం లేదు? అట్టడుగు వర్గాల వారు ఇంకా కిందికి ఎందుకు వెలుతున్నారు?

అయితే ఒక్క విషయం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ముందు ఇదే సర్వేలు స్కూలులో ప్రవేశం కోసం మొత్తం తెలంగాణ నుంచి పోటీ పరీక్ష పెట్టి గాలించి తెచ్చిన వారు ఉంటే తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాకే పరిమితమయ్యారు. ఇప్పుడు అందులో కూడా ప్రవేటు స్కూళ్ళకు డబ్బులు లేని నిరుపేదలే వస్తున్నారు, అయినా స్కూలు సక్సెస్ రేటు మాత్రం చెక్కుచెదరలేదు.  ఇప్పటికీ ఇక్కడినుండి బయటికి వెల్లినవారికి భవిష్యత్తు బాగానే ఉంటుంది.  ఇక్కడి విద్యార్థుల సక్సెస్‌కు కారణం ఇక్కడి పోటీ వాతావరణం కావొచ్చు.స్కూలు పేరు ప్రఖ్యాతులు పడిపోకుండా కాపాడాలనే తాపత్రయం ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో ఉండి ఉండొచ్చు. 

పరిస్థితులు ఎంత మారినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ఈబడి మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉంది, మౌనంగా. సమాజానికి మెరికల్లాంటి కొత్త రక్తాన్ని సరఫారా చేస్తూనే ఉంది, నిరంతరంగా. ఆశా, ఆవేదనలతో కలగాపులగమయిన ఆలోచనల్లో తిరుగుప్రయాణమయ్యము.

Monday, November 22, 2021

నా బడి!

 నా బడి!

అప్పుడే ముప్పై ఏల్లయ్యింది, 
ఈబడిని వదిలిపెట్టి, ప్రపంచంలో అడుగుపెట్టి!  
ఈబడి చదువులే కదా, నన్ను సమాజంలో నిలబెట్టింది? 
ఈగాలి పీల్చినంకనే గదా లోకం సోయివచ్చింది?  

ఏమిచ్చిందీ బడి అని చూసుకుంటే చాలానే ఉన్నై! 
చదువెలాగూ ఇచ్చింది, సమాజాన్నీ చదవమని చెప్పింది.
మంచి దోస్తులనిచ్చింది, స్నేహం విలువను నేర్పింది.
కష్టం వచ్చినప్పుడు  నావాళ్ళుంటారనే ధైర్యాన్నిచ్చింది!       
 
బలవంతుడు బలహీనుడిపై  
దౌర్జన్యం చేస్తున్నప్పుడు
బలహీనుడి పక్షం నిలవడం నేర్పింది,
కొట్టేవాడు నామిత్రుడైనా! 
 
అసమానత కొలబద్దయినప్పుడు 
అవమానం ఎదురైనప్పుడు  
అందరం కలిసి నిలిస్తే జయం మనదేనని చెప్పింది,  
అవతలి పక్షం ఎంత పెద్దదైనా!

న్యాయం, అన్యాయం మధ్యన సంఘర్షణ మొదలైతే
నీగొంతెపుడూ న్యాయం వైపుండాలన్నది, 
నువు నోరెత్తకపోతే, అది అన్యాయానికి వత్తాసేనన్నది!

ఆశించిన ఫలితం దొరకక,
అవకాశం అందని ఫలమై  
అపజయాలు ఎదురైనప్పుడు 
 
నీబలంపై నమ్మకముంచు,
ధైర్యంగా నిలబడి నడువు,
విజయం చివరికి నీదేనంది!!