Sunday, March 29, 2020

కరోనా నీకేం చెప్పింది?
విదేశాల్లో చిక్కుకుంటే విమానాలు పంపిస్తారు,
పక్క రాష్ట్రం వెల్తానంటే మక్కెలిరగ్గొడుతారని.
గొప్పవారు తప్పులు చేస్తూ మహమ్మారిని వ్యాప్తిచేస్తుంటే
ముంచుకొచ్చేది మాత్రం పొట్టగడవని రోజుకూలీకేనని!

ఇంకా ఏం చెప్పింది?
గుడయినా, చర్చి అయినా, మసీదు అయినా
ప్రాణం ముంచుకొస్తుంటే ప్రార్ధనలేం పనిచేయవని.
రోగానికి మతం, కులం , రాజూ పేదా తేడాల్లేవని,