అంగట్లో కొత్త బీఎండబ్ల్యూ కళ్ళు చెదిరే అందం సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రింగురోడ్డుపై రయ్యుమంటూ దూసుకుపోయిండొక కొత్త ఓనరు కొత్త కారు మోజులోబలమైన కారుకు
Tuesday, October 1, 2024
కొత్త బీఎండబ్ల్యూ
బలిసిన బ్యాంకు బ్యాలెన్సు తోడైతే
పుట్టుకొచ్చిన ఓవర్‌కాంఫిడెన్సు
కొత్త బీఎండబ్ల్యూ గట్టిది
అదుపు తప్పినా తట్టుకుంది
ఎదురొచ్చిన పేద టాక్సీడ్రైవరే...
(నిన్న శామీర్‌పేటలో జరిగిన ఘటన) Wednesday, February 8, 2023 at 9:39 AM
Tuesday, January 17, 2023
తెలుగు సినిమా
తెలుగు సినిమా
*********
అరువు హీరోయిన్లు
బరువు బడ్జెట్లు
పరువుకోసం హీరోలు
కథలు కరువు
కాపీ సీన్లు
కానరాదు కొత్తదనం
*********
అరువు హీరోయిన్లు
బరువు బడ్జెట్లు
పరువుకోసం హీరోలు
కథలు కరువు
కాపీ సీన్లు
కానరాదు కొత్తదనం
కామేడియెన్లు
పంచుడైలాగులు
ఐటం సాంగులే హైలైట్లు
మొదటివారం కలెక్షన్లే
నిర్మాతల టార్గెట్లు
టేస్టులేని ఆడియన్సు
గంతులేసే వెర్రిఫాన్సు
మారనంత వరకు మనకు
మంచి సినిమా దొరకదు
Thursday, January 12, 2023
కలల దొంగలు
కలల దొంగలు
*********
ఇంకా తెల్లవారనే లేదు
నాకింకా నిద్దుర చాలనేలేదు
చల్లటి చలికాలంలో
ఎక్కడ నా అందమైన కల
నన్నొదిలి పారిపోతుందోనని
భయంతో బిగిసి పట్టుకున్నా
ఏదో ఫ్లాటులో పెద్దగా
బలవంతపు సుప్రభాతగీతం
దూరంగా గుడిలో
వేదమంత్రాల ఘోష
పక్కపక్కనున్న మసీదుల
అజాన్ల జుగల్బందీ
అంతా కలిసి దొంగల్లా
నాకలను ఎత్తుకెల్లారు
నా నిద్దుర దూరం చేశారు
ఇప్పుడెవరిని నిందించాలి?
కలలు
పిల్లలు
******
కలలు కనొచ్చు
పిల్లలను కనొచ్చు
పిల్లల భవితల కలలను
మనమే కంటే ఎలా?
******
కలలు కనొచ్చు
పిల్లలను కనొచ్చు
పిల్లల భవితల కలలను
మనమే కంటే ఎలా?
నీతోనే ఉండొచ్చు
నీప్రేమను ఇవ్వొచ్చు
అంతదానికే వాల్లను
నీసొంతం అనుకోవచ్చా?
రక్తం పంచొచ్చు
ఆస్తులు ఇవ్వొచ్చు
మన ఆశలనూ,
మన ఆత్మలనూ ఇచ్చేదెలా?
Tuesday, December 27, 2022
నేస్తం, రవీ!
నేస్తం, రవీ!
అప్పుడే వెళ్ళిపోయావా?
మమ్మువిడిచి మరులోకాలకు!
ఏమైందని అంత తొందర?
ఏలోపం జరిగిందింక్కడ?
ఎవరు పిలిచారు నిన్నక్కడ?
అందమైన జీవితం
కుదురైన కుటుంబం
బాల్యం వీడని పిల్లలు,
నిన్నే తలుచుకునే నీతండ్రి
అన్నీ వదలి దేనికి పయనం?
పైలోకంలో పరమాత్ముడెదురైతే
ఎందుకు చేశావీ అన్యాయమని
ఎలుగెత్తి ప్రశ్నించమంటావా?
మంచివాళ్ళకు ముందే పిలుపని
సమాధానపడమంటావా?
దోమలు
దోమలు
*****
ఆలోచనల దోమలు
గుండెల్లో గూడుకట్టి
ఝుమ్మని రొదచేస్తుంటే,
*****
ఆలోచనల దోమలు
గుండెల్లో గూడుకట్టి
ఝుమ్మని రొదచేస్తుంటే,
వీలు చిక్కినప్పుడల్లా
మెదల్లో తొండాలు పెట్టి
ఙ్ఞాపకాల దొంతరలను తొలుస్తుంటే
ఎన్ని అబద్దాల
ఆలౌట్లు కావాలో,
తిరిగి నిద్దుర దొరికిచ్చుకోవాలంటే..
Monday, January 24, 2022
మాకు తొడుక్కునేటందుకు గోచీగుడ్డలు లేకుంటేనేం?
మాకు తొడుక్కునేటందుకు గోచీగుడ్డలు లేకుంటేనేం?
నువ్వు మాకోసం రోజుకు ఐదు అర్మాని సూట్లు మారుస్తుండంగ!
పెట్రోలు కొనలేక నేను నా డొక్కు స్కూటర్ అమ్మేసా,
నువ్వు మాత్రం పన్నెండు కోట్ల కార్లో సల్లంగ తిరుగాలి!
ఆక్సీజన్ దొరక్క కోవిడ్ పేషంట్లు రోడ్లు పట్టుకు తిరిగితేనేం,
నువ్వు మాకోసం సరికొత్త సెంట్రల్ వీష్టాలో కొలువుతీరితే?
ఆర్ధిక మాంద్యంలో మాబతుకులు బుగ్గయిపోయినయ్,
నువ్వు ఎయిర్ ఇండియా ఒన్‌లో తిరగాడానికి దేశాలేమన్న మిగిల్నయా?
ఒక్కొక్కటిగ నువ్వు ప్రభుత్వ ఆస్థులు అమ్ముతుంటె,
అదాని, అంబానీల ఆస్థులు రోజుకింత పెరుగాలి!
నువ్వు సల్లంగుండాలి, మేం నీకోసం కొట్టుకు సావాలి!
దేశంకోసం ధర్మంకోసం గిది గిట్లనె జరగాలి!!
Subscribe to:
Posts (Atom)